కరోనా వైరస్ డెల్టా వేరియంట్ ప్రస్తుతం 104 దేశాలకు విస్తరించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వెల్లడించింది. దీని తీవ్రత ప్రపంచంపై భారీగా పడే అవకాశముందని WHO చీఫ్ టెడ్రోస్ అథనామ్ ఆందోళన వ్యక్తం చేశారు.ప్రపంచవ్యాప్తంగా..... వరుసగా నాలుగో వారం కూడా కేసులు సంఖ్య పెరిగిందన్న WHO చీఫ్........... 10వారాల పాటు వరుసగా కేసులు తగ్గిన ఆరు ప్రాంతాల్లో.... వైరస్ మళ్లీ తిరగబెట్టడం ఆందోళనకరమన్నారు . డెల్టా వేరియంట్ కారణంగా కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయని....... ప్రజా ఆరోగ్య వ్యవస్థ దారుణంగా దెబ్బతింటోందని..... వివరించారు. దీని వల్ల ప్రజల జీవితాలు, ఆర్థిక వ్యవస్థకు మరింత ముప్పు ఏర్పడే అవకాశముందని టెడ్రోస్ అథనామ్ అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్లు తక్కువగా లభిస్తున్న ప్రాంతాల్లో........పరిస్థితి అత్యంత విషమంగా ఉందన్న WHO చీఫ్............ కొన్ని దేశాలు ఎక్కువ మోతాదులో, ముందస్తుగానే టీకాలను ఆర్డర్ ఇవ్వడం వలన అనేక దేశాల్లో కనీసం ఆరోగ్య కార్యకర్తలకు కూడా టీకాలు అందని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
#LatestNews
#Etv Telangana
0 Comments