దేశంలో న్యాయమూర్తులకు........ CISF వంటి జాతీయ స్థాయి భద్రతను కల్పించడం సాధ్యం కాదని........, ఉచితం కూడా కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు తెలిపింది. ఝార్ఖండ్ లోని ధన్ బాద్ లో......... జిల్లా జడ్జి హత్య నేపథ్యంలో దేశంలో న్యాయమూర్తుల భద్రతకు చేపట్టిన చర్యలపై నివేదిక ఇవ్వాలన్న సుప్రీం ఆదేశాల మేరకు వివరణ ఇచ్చింది. ఐతే... ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ, ఝార్ఖండ్ సహా పలు రాష్ట్రాలు ఇంకా నివేదిక సమర్పించలేదు. ఆయా రాష్ట్రాలకు వారం గడువు ఇచ్చిన.......... ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ NV రమణ నేతృత్వంలోని ధర్మాసనం... అప్పటికీ సమర్పించకపోతే లక్ష రూపాయల జరిమానాతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు.... విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. జడ్జిల భద్రతకు సంబంధించి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేలా కేంద్ర హోం శాఖ 2007లో మార్గదర్శకాలు జారీచేసిందని.......... కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా............ కోర్టుకు తెలిపారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న ధర్మాసనం........ CISF లేదా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తరహాలో ప్రత్యేక దళాన్ని ఏర్పాటుచేసేందుకు..కేంద్రం సుముఖంగా ఉందా అని ప్రశ్నించింది. అధి సాధ్యంకాదన్న సొలిసిటర్ జనరల్ ...గతంలో జారీచేసిన మార్గదర్శకాలు అమలుచేస్తే సరిపోతుందన్నారు. అయితే....ఆ మేరకు అన్ని రాష్ట్రాలతో సమావేశం నిర్వహించాలని కేంద్రానికి ధర్మాసనం సూచించింది.
#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------
0 Comments