రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం | Heavy Rains Lashed | in Various Places

రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం | Heavy Rains Lashed | in Various Places

రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గుంటూరు జిల్లా పల్నాడులో కుండపోత వర్షానికి.... లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దాచేపల్లిలోని కాట్రపాడు వాగు ఉద్ధృతికి... ఓ వ్యక్తి కాలుజారి పడిపోయాడు. గల్లంతైన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మాచవరం మండలం నాగేశ్వరపురం తండా సమీపంలో పిల్లి వాగు ప్రవాహానికి అటువైపు వెళ్లే మార్గాలు పూర్తిగా నిలిపివేశారు. పిడుగురాళ్లలోని RTC బస్టాండ్ కాలనీ పూర్తిగా జలమయమైంది. తుమ్మలచెరువు రైల్వే స్టేషన్ లోని.... 67వ గేటు వద్ద రైల్వేట్రాక్ పై నిలిచిన వర్షపు నీటిని సిబ్బంది తొలగించారు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి... RTC బస్ స్టాండ్ చెరువును తలపిస్తోంది. ప్రాంగణమంతా వర్షం నీరు చేరి ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం మహాదేవపురం పొలాల్లో పిడుగుపడి.... 10 పశువులు మృతి చెందగా.... మరో ఇద్దరు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శ్రీకాకుళంలోని పెద్దపాడు రహదారి వద్దనున్న రామిగెడ్డ ప్రవాహంలో రెండు గేదెలు చిక్కుకున్నాయి. కల్వర్టు కింద ఇరుక ్కుపోయిన పశువులను... గంటన్నరపాటు శ్రమించి స్థానికులు రక్షించారు.

#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

ETVETV TeluguETV NewsVideo

Post a Comment

0 Comments